- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ సముద్రంలో కలవడం ఖాయం: మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. అధికార వైసీపీ, సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు దీటుగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయం పవన్ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మైక్ పట్టుకుని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కు పిచ్చి ప్రేలాపనలు తప్పితే రాష్ట్రం గురించి ఏమీ తెలియదని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఉపన్యాసాల్లో సీఎం జగన్‌పై ఈర్ష, అసూయ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ సముద్రంలో కలిసిపోవడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జగన్ సీఎం కావడం ఖయామని దీమా వ్యక్తం చేశారు.






