AP News:టెన్త్, ఇంటర్ టాపర్ స్టూడెంట్స్‌కు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డ్స్ అందజేసిన మంత్రి

by Jakkula.Mamatha |

తిరుపతి మహతి ఆడిటోరియంలో టెన్త్, ఇంటర్ తరగతులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డ్స్‌ను మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satya Prasad) అందజేశారు.

AP News:టెన్త్, ఇంటర్ టాపర్ స్టూడెంట్స్‌కు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డ్స్ అందజేసిన మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి మహతి ఆడిటోరియంలో టెన్త్, ఇంటర్ తరగతులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ అవార్డ్స్‌ను మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satya Prasad) అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. కానీ.. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో రాష్ట్రాన్ని విద్యారంగంలో 19వ స్థానానికి దిగజార్చిందని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మంత్రి అనగాని మండిపడ్డారు.

నిన్న మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్‌కు ఆరు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. గత ప్రభుత్వం అసలు బీచ్ ఫెస్టివల్‌నే జరుపలేదు. అదేవిధంగా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టింది. గత ప్రభుత్వ దెబ్బకు పరిశ్రమలు పారిపోయాయి.. పక్షులు పారిపోయాయి, ఫెస్టివల్ పారిపోయాయి అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి(State Development) సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సమిష్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు.

అందులో భాగంగానే ప్రతిభకు పట్టం కడుతూ.. షైనింగ్ స్టార్ అవార్డ్స్‌ను ఇస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గాడి తప్పిన విద్యావ్యవస్థను దారిలో పెడుతున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక ప్రణాళిక వేసుకొని పని చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థుల(Inter students)కు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు. మోడల్ స్కూల్ లు ఏర్పాటు చేస్తున్నారు. స్టార్ రేటింగ్ పెట్టుకొని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ దేశంలోనే మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను విద్యార్థులంతా ఉపయోగించుకోవాలని సూచించారు. తిరుపతి ప్రాంతం నుంచే వచ్చిన సీఎం చంద్రబాబు మాదిరి విద్యార్థులంతా ఉన్నత స్థానాలకు ఎదగాలి అని మంత్రి అనగాని తెలిపారు.

Next Story