Good News: మత్స్యకారులకు రూ. 20 వేలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-28 07:15:59  IST  )

మత్స్యకారుల భృతిని రెట్టింపు చేస్తూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు...

Good News: మత్స్యకారులకు రూ. 20 వేలు
X

దిశ, వెబ్ డెస్క్: మత్స్యకారుల(Fishermen)కు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చేపలవేట(Fishing) నిషేధకాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు రెట్టింపు చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) ప్రకటించారు. ఏపీ వార్షిక బడ్జెట్ సందర్భంగా చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు రూ. 20 వేలు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని మంత్రి పయ్యావుల తెలిపారు.


కాగా ఏప్రిల్ నుంచి జూన్ వరకూ సముద్రంలో చేపట వేటను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మత్స్య సంపద పునరుత్పత్తి సమయం కావడంతో చాలా ఏళ్లుగా ఈ నిషేధం కొనసాగుతోంది. అయితే ఈ సమయంలో మత్య్సకారులను జీవనోపాధి ఉండదు. దీంతో ఆదుకునేందుకు 1996లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మత్య్సకారులకు ఆర్థిక సాయంగా రూ. 2 వేలు అందజేసింది. కాల క్రమేణా తదుపరి ప్రభుత్వాలు ఈ భృతిని పెంచుకుంటూ వచ్చాయి. గత ఏడాది ఈ భృతి రూ. 10 వేలకు చేరింది. అయితే గత ఏడాదికి సంబంధించిన భృతిని జగన్ ప్రభుత్వం అందించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శుభవార్త ప్రకటించింది. మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మత్య్సకారుల భృతిపై అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు.

Next Story