255 చర్చిలకు గుడ్ న్యూస్.. మునుపెన్నడు లేని విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్

by Vemula.Srinu Prasad |

మునుపెన్నడు లేని విధంగా క్రిస్టియన్ సోదరులు అభివృద్ధి, సంక్షేమానికి రూ 150 కోట్లు అదనంగా కేటాయించామని మంత్రి పార్థసారథి అన్నారు...

255 చర్చిలకు గుడ్ న్యూస్.. మునుపెన్నడు లేని విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్
X

దిశ, వెబ్ డెస్క్: నూజివీడు మంత్రివర్యులు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్టమస్‌కు ప్రత్యేక అతిథిగా హాజరై ఫాదర్స్, మత పెద్దలకు, సోదర, సోదరీ మణులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారధి క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మొదటిగా మంత్రికి ఘనంగా స్వాగతం పలికి చర్చి ఫాదర్స్, సిస్టర్స్ వాక్యం చదివిన అనంతరం కేక్‌ను కట్ చేసి అందరికీ ఆయన అందజేశారు. స్నేహ రైట్స్ బి.నగేష్ రావు ఆధ్వర్యంలో 30 మంది నిరుపేదలకు 17 రకాలు నిత్యవసర సరుకులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా క్రిస్టియన్ సోదరులు అభివృద్ధి, సంక్షేమానికి రూ 150 కోట్లు అదనంగా కేటాయించామని అన్నారు. జెరూసలేము యాత్రకు, విదేశీ విద్యను అభ్యచించడానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించామని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు కావలసిన తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. క్రైస్తవులు కుటుంబాలు మంచి ప్రేమ, ఆప్యాయతలు కలవారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేవుడు దృష్టిలో మానవులంతా సమానం అని, ఎవరికి కావలసిన అవసరాలు వారికి పుట్టించినప్పుడే వారికి సమృద్ధిగా ఇస్తారని తెలిపారు. దేవుడి దయతో మాత్రమే ఈ పదవులు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. దేవుని మార్గంలో నడిస్తే అందరూ ఆరోగ్యంగా, అభివృద్ధి చెందుతారని అన్నారు. అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలని మత పెద్దలను, ఫాదర్స్‌లను కోరారు. గతంలో 255 క్రైస్తవ మందిరాలకు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం కూడా మన ప్రజా ప్రభుత్వమేనని తెలిపారు. గతంలో క్రిస్టియన్ సోదరులకు అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని తెలిపారు. ప్రభువు ఆశీస్సులతో రాష్ట్రం, నియోజకవర్గం అంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని, అందరి జీవితాల్లో చీకటి తొలగిపోయి వెలుగులు నింపాలని, విజయాలు సిద్ధించాలని ఏసు ప్రభువును కోరానని అన్నారు.

Next Story