సతీశ్ హత్య కేసుపై వాళ్లకంత ఉత్సాహం ఎందుకు: మంత్రి పార్థసారథి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

సతీశ్ హత్య కేసుపై మంత్రి పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు..

సతీశ్ హత్య కేసుపై వాళ్లకంత ఉత్సాహం ఎందుకు: మంత్రి పార్థసారథి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పరకామణి చోరీ కేసు(Parakamani theft case) ఫిర్యాదుదారుడు, గుంతకల్లు రైల్వే ఆర్మ్డ్ రిజర్వ్ సీఐ సతీశ్ కుమార్(Railway Armed Reserve CI Satish Kumar) హత్య కేసులో వైసీపీ నాయకులు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని అని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సతీశ్ కుమార్ టీటీడీ(TTD)లో పని చేస్తున్న సమయంలో చోరీ జరిగిందని, ఇప్పటికే ఆయన వాగ్మూలం కూడా ఇచ్చారని గుర్తు చేశారు. సతీశ్ కుమార్ నిజాలు బయటపెడతారనే భయంతోనే అతన్ను చంపేసి ఉంటారని మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) అనుమానం వ్యక్తం చేశారు.

వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగినప్పుడు కూడా గుండెపోటు అంటూ ప్రచారం చేశారన్నారు. సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందితే ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సతీశ్ కుమార్‌ది ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. సతీశ్ కుమార్ ఆత్మహత్మ చేసుకున్నారని పోలీసు దర్యాప్తు కంటే ముందే ఎలా తెలిసిందన్నారు. సతీశ్ కుమార్‌తో ప్రయాణం చేసేలా తమ మనుషులను పంపారా అని ప్రశ్నించారు. సతీశ్ మరణానికి, వైసీపీ నాయకులకు సంబంధమేంటని, ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని నిలదీశారు. గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీసిందని దుయ్యబట్టారు. భక్తులకు పంపిణీ చేసే లడ్డూలో కూడా కల్తీకి పాల్పడిందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు.

Next Story