- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కసారికే తీరని నష్టం.. ఇప్పుడు మళ్లీనా: జగన్ పాదయాత్రపై మంత్రి రియాక్షన్
వైఎస్ జగన్ చేసిన ఒక్క పాదయాత్రతో రాష్ట్రానికి అంచనాకు అందని నష్టం జరిగిందని మంత్రి పార్థసారథి విమర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) చేసిన ఒక్క పాదయాత్రతో రాష్ట్రానికి అంచనాకు అందని నష్టం జరిగిందని మంత్రి పార్థసారథి(Minister ParthaSarathi) విమర్శించారు. జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తానని చేసిన ప్రకటనపై ఆయన స్పందిచారు. అప్పుడే చాలా నష్టం జరిగిందని, ఇంకో పాదయాత్ర జరిపితే ఎంత నష్ట పోతారో ప్రజలు ఊహించలేరని ఎద్దేవా చేశారు. ప్రైవేటైజేషన్ కు పీపీపీకి తేడా తెలియని వ్యక్తి అధికారంలోకి వస్తే సీఎం కుర్చీనీ ప్రైవైటైజేషన్ చేస్తారేమోనని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ హయాంలోనే విజయవాడ ఆస్పత్రిలో కార్డియాక్ విభాగాన్ని పీపీపీ విధానం అమలు చేశారని గుర్తు చేశారు. పీపీపీ విధానంలోనే రాష్ట్ర ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
‘గంజాయి బ్యాచ్‌కు బాసటగా జగన్
‘‘గంజాయి బ్యాచ్‌కు జగన్ బాసటగా నిలిచిన వైనాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కార్యకర్తలు రప్పా రప్పా నరుకుతాం అంటూ నినదిస్తున్నా జగన్ కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. వైఎస్ జగన్ కారుకింద పడి కార్యకర్త మృతి చెందినా కనీసం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చట్టాన్ని,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారు. అధికారం ఉండగా జగన్ దళితులు కనపడలేదు. అధికారం పోగానే దళితులు గుర్తుకు వస్తున్నారు.’’ అని మంత్రి పార్థసారథి విమర్శించారు.






