- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ ఉన్మాదాన్ని మించిన రాజకీయాలు చేస్తోంది : మంత్రి పార్థసారథి
వైసీపీ ఉన్మాదాన్ని మించిన రాజకీయాలు చేస్తోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు ఉగ్రవాదులకంటే దారుణంగా ఉందని వైసీపీ మంత్రి పార్ధసారథి అన్నారు. వైసీపీ ఉన్మాద రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ఉన్మాద రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తుకు పెనుముప్పుగా మారిందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరిగిందని, అరాచక పాలనతో రాష్ట్రాన్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టారని విమర్శించారు. ఇటీవల జరిగిన తోట చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండించారు.
సామాన్య కార్యకర్తను అతి కిరాతకంగా హత్య చేయడం వ్యక్తిగత ఘటన మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఈ ఘటనలో దోషుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. అలాగే.. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు మహిళలు, రాజకీయ ప్రత్యర్థుల కుటుంబీకులపై అసభ్యకర పోస్టులు పెడుతుండటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని, అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతల పునరుద్ధరణే ప్రాధాన్యమిస్తామన్నారు.






