- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి నిమ్మలపై దాడి కేసు.. సీఐడీకి బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు
మంత్రి నిమ్మల రామానాయుడి (Minister Nimmala Ramanaidu)పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి నిమ్మల రామానాయుడి (Minister Nimmala Ramanaidu)పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు కేసును వెంటనే సీఐడీ (CID)కి బదలాయిస్తూ ఇవాళ ఉదయం డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో తనపై దాడి చేశారంటూ నిమ్మల రామానాయుడు పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ, రాజకీయ కుట్ర, వైసీపీ నేతల ఒత్తిడి కారణంగా నాడు జరిగిన దాడి ఘటనపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2022లో నిమ్మల చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా ఎలాంటి పురోగతి లేదు. ఈ క్రమంలోనే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నర్సాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో లోతుగా విచారణ చేపట్టేందుకు కేసును సీఐడీకి బదలాయిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. అందులో విజయవాడ సీఐడీ డీఎస్పీ మోహన్ లీడ్‌గా ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ కేసు దర్యాప్తును చేపడుతుందని పేర్కొన్నారు.






