- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యం : మంత్రి నిమ్మల
by Naga Rani Yarlagadda |
2027 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

X
దిశ, వెబ్‌డెస్క్: 2027 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. డయాఫ్రం వాల్ పొడవు 1396 మీటర్లకు 500 మీటర్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. అలాగే 3 ట్రెంచ్ కట్టర్లు, 3 గ్రాబర్లలో డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వరద సమయంలోనూ నిర్మాణ పనులకు ఆటంకం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత ఉండదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
Next Story






