- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష
ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీటిపారుదలశాఖ సలహాదారు, ఈఎన్ సీ, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి మొదటివారంలో సీఎం చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు. రూ.456 కోట్లతో సీఎం వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. 2026 పంటల సీజన్ మొదలయ్యే సమయానికి వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మాణం 83 శాతం పూర్తయిందని మంత్రి నిమ్మల తెలిపారు. గతంలో పోలవరాన్ని వైసీపీ నాశనం చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.3800 కోట్లను గతంలో జగన్ డైవర్ట్ చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్వాసితులకు రూ.1894 కోట్లు ఇచ్చామన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని తెలిపారు.






