రాష్ట్రంలో ఆ పార్టీ శకం ముగిసింది: మంత్రి సంచలన కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-22 11:25:41  IST  )

రాష్ట్రంలో ఆ పార్టీ శకం ముగిసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు...

రాష్ట్రంలో ఆ పార్టీ శకం ముగిసింది: మంత్రి సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో వైసీపీ(Ycp) శకం ముగిసిందని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala RamaNaidu) విమర్శించారు. త్వరలో వైఎస్ జగన్(Ys Jagan) పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అధికారం పోయిన తర్వాత జగన్‌కు పాదయాత్ర గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు జగన్ మొద్దు నిద్రలో తేలి ఇప్పుడు పాదయాత్ర అంటూ మళ్లీ డ్రామాకు తెరతీశారని నిమ్మల ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో రూ. 10.92 కోట్లతో కాజ మేజర్ డ్రైన్ పై అవుట్ ఫాల్స్ స్లూయిస్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. యలమంచిలి నుంచి బాడవ వరకు ఏటుగటుపై గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. గత ఐదేళ్లలో గోదావరి నది ముంపుతో వేలాది పంటలు నష్టపోయాయని నిమ్మల వ్యాఖ్యానించారు. అధికారులు వచ్చారు.. వెళ్లారు తప్ప కాజ మేజర్ డ్రైన్ పై అవుట్ ఫాల్స్ స్లూయిస్‌కు మోక్షం కలగలేదన్నారు. తాజాగా ఆ పనులకు కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిందని వ్యాఖ్యానించారు. రైతు పక్షపాతి ప్రభుత్వం తమదని నిమ్మల తెలిపారు.

Next Story