ఏపీకి ప్రపంచస్థాయి కంపెనీలు.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు

by Vemula.Srinu Prasad |

సీఎం చంద్రబాబుపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నంసలు కురిపించారు..

ఏపీకి ప్రపంచస్థాయి కంపెనీలు.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అభివృద్ధి అంబాసిడర్ చంద్రబాబు నాయుడు ప్రపంచస్థాయి కంపెనీలను ఏపీకి రప్పిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో ‘మన రైతు మన రామానాయుడు‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు కోట్ల ఇరవై లక్షలతో జలజీవన్ మిషన్ అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్ర ఆర్థిక మూలాలే దెబ్బతిన్నాయన్నారు. అభివృద్ధికి 14 లక్షల కోట్లు అప్పు, ఏ శాఖలో చూసినా వేల కోట్లలో చెల్లించాల్సిన బకాయిలు ఆటంకాలుగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జలాశయాలల్లో వచ్చే జూన్‌కి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. వేసవిలో తాగు, సాగు నీటి అవసరాలకు ఏ ఇబ్బంది లేదని చెప్పారు. శిశుపాలుడు వంద తప్పులు మాదిరి జగన్ ముఠా చేసిన వేల పాపాలు నేడు ఆ పార్టీకి శాపాలయ్యాయని ఎద్దేవా చేశారు. వైసీపీ ఉనికి ప్రశ్నార్ధకమయ్యే రోజులు ఆసన్నమయ్యాయని నిమ్మల రామానాయుడు జోస్యం చెప్పారు.

Next Story