బుడమేరు వద్ద సీసీ వాల్ నిర్మాణం పూర్తి.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-30 08:55:20  IST  )

బుడమేరు గండ్లు పూడ్చివేతపై మంత్రి నిమ్మల రామానాయుడు కీీలక వ్యాఖ్యలు చేశారు..

బుడమేరు వద్ద సీసీ వాల్ నిర్మాణం పూర్తి.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత ఏడాది బుడమేరు(Budameru) వరద(Floods)వల్ల విజయవాడ నగరం(Vijayawada) అతలాకుతలమైన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) వద్ద వరదకు కారణమైన బుడమేరు గండ్లను పూడ్చి సీసీవాల్‌ను నిర్మించారు. తాజాగా ఈ పనులు పూర్తి కావడంతో మంత్రి నిమ్మల రామా నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యవసర పరిస్ధితుల్లో ఆనాడు తాత్కాలికంగా పూడ్చిన 3 గండ్లు కలిపుతూ రూ.23 కోట్లతో సిసి వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ పనులు పూర్తి చేశామని నిమ్మల చెప్పారు.

వెలగలేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు మార్చి రూ. 1.8 కోట్లతో కొత్త గేట్లను అమర్చామని మంత్రి నిమ్మల తెలిపారు. బుడమేరు గట్టు పటిష్టత కోసం వెలగలేరు నుంచి ఈలప్రోలు వరకు 7 కిలో మీటర్ల పొడవున గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కి.మీ పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. కొల్లేరు నుండి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా రూ. 9 కోట్లతో డీసిల్టింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎనికేపాడు యూటీ సామర్ధ్యాన్ని 4 వేల క్యూసెక్కుల నుండి 20వేల క్యూసెక్కులకు పెంచేలా ప్రతిపాదనలు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Next Story