జగన్ లేఖనే కారణం: జల వివాదంపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-02 14:54:47  IST  )

కృష్ణా జలాల పంపిణీపై జగన్ లేఖ దొంగే దొంగ అన్నట్టు ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు...

జగన్ లేఖనే కారణం: జల వివాదంపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జలాల పంపిణీపై జగన్ లేఖ చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. కృష్ణా నదీజలాలపై సమీక్ష చేసే అధికారం ఇచ్చిందే జగన్ అని ఆయన తెలిపారు. తన అసమర్థత కారణంగా నేడు కృష్ణా జలాలపై చర్చ చేయాల్సి వస్తుందన్నారు. కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు సాధించిన ఘనత చంద్రబాబుది అని చెప్పారు. 2020 అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ కొత్త ప్రతిపాదన తీసుకొస్తే జగన్ మౌనంగా ఉన్నాడే కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలపై బలమైన వాదన వినిపిస్తోందని మంత్రి తెలిపారు.

ఆధారాలు లేవు కాబట్టే కేసుల విత్ డ్రా

‘‘ప్రతి జిల్లాలో జగన్కు ఆస్తులు ఉన్నాయి. తండ్రి పదవిని అడ్డంపెట్టుకొని జగన్ లూటీ చేశాడు. లక్ష కోట్లు సంపాదించాడు. రూ.43 వేల కోట్ల అక్రమ ఆస్తులపై జైలుకు వెళ్లాడు. ఆ డబ్బులతో రాజకీయాల్లోకి వచ్చాడు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం అదికాదు. కడిగిన ఆణిముత్యం చంద్రబాబు. కావాలనే చంద్రబాబుపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వం మద్యం అమ్ముతుందని చెప్పి తన గుప్పిట్లో పెట్టుకొని రూ.వేల కోట్లు మద్యం కుంభకోణం చేశాడు. ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం వద్దు ఉన్నదాన్ని ప్రైవేట్ కు అప్పగించాడు, ప్రైవేట్ పరంగా అమ్మాల్సిన మద్యం ప్రభుత్వంలోకి తీసుకొని కోట్లు కొల్లగొట్టాడు. చంద్రబాబుపై ఉన్నవన్ని ఆధారాలు లేని కేసులు, అందుకే కోర్టులు కొట్టేస్తున్నాయి.’’ అని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.

Next Story