సహకరించకపోయినా చెడగొట్టొద్దు: జగన్‌కు మంత్రి నిమ్మల రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

ఆల్మట్టి విషయంపై వైఎస్ జగన్ విమర్శలకు మంత్రి నిమ్మల రామానాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..

సహకరించకపోయినా చెడగొట్టొద్దు: జగన్‌కు మంత్రి నిమ్మల రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆల్మట్టి విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Ys Jagan) చేస్తున్న విమర్శలకు మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆల్మట్టి(Almatty)పై కూటమి ప్రభుత్వం అంతరాయం లేని పోరాటం చేస్తోందని, ఆ డ్యామ్ ఎత్తు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆది నుంచి అడ్డుకున్నామని ఆయన తెలిపారు తాము అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రతిఘటించామని, ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహించామని చెప్పారు. కోర్టులను ఆశ్రయించి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

అయితే గత ఐదేళ్లు నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రూ. 50 వేల కోట్ల పంట నష్టానికి కారణమై జగన్ చరిత్ర హీనుడిగా మారిపోయారని విమర్శించారు. అలాంటి జగన్ ఆల్మట్టిపై ఇప్పుడు ఆందోళన చెందటం దెయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్(Polavaram diaphragm wall) దెబ్బ తినడానికి జగనే కారకుడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వట్టిగా పడి ఉండడానికి కారకుడు జగనేనన్నారు. అటు రాయలసీమ ప్రాజెక్టులు నత్తనడకసాగడానికి కారణం కూడా జగనేనని విమర్శించారు. అబద్ధాల కోరు జగన్‌కి ఆల్మట్టిపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సహకరించక పోయినా పర్వాలేదు గానీ, చెడగొట్టొద్దని మంత్రి నిమ్మల రామానాయుడు రిక్వెస్ట్ చేశారు.

Next Story