- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Nimmala: ఐదేళ్లలో జగన్ అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు: మంత్రి నిమ్మల ఫైర్
ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) భ్రష్టు పట్టించారని మంత్రి నిమ్మల రామనాయుడు (Minister Nimmala Ramanayudu) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) భ్రష్టు పట్టించారని మంత్రి నిమ్మల రామనాయుడు (Minister Nimmala Ramanayudu) ఆరోపించారు. ఇవాళ ఆయన ఇరిగేషన్ ఎన్జీవోస్ సంఘం (Association of Irrigation NGOs) డైరీ ఆవిష్కరణ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడంతో రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశాడని పైర్ అయ్యారు. విదేశీ పెట్టుబడులు దేవుడెరుగు.. ఉన్న సంపదను దోచుకోకుంటే చాలు అన్న చందంగా వైసీపీ (YCP) పాలన కొనసాగిందని అన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల గేట్లు, షెటర్లకు కనీసం గ్రీజు కూడా పుయలేదని ఆరోపించారు.
ప్రాజెక్టుల బాగోగులు పట్టించుకోని మంత్రి, సీఎంను తాను ఎక్కడా చూడలేదని సెటైర్లు వేశారు. వైసీపీ మంత్రులు (YCP Ministers), ఎమ్మెల్యేలు (MLA's) విచ్చలవిడిగా భూకబ్జాలు, అరాచకాలకు పాల్పడ్డారని కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) నేతలు టీడీపీ (TDP) కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని, అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టారని ఫైర్ అయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలైందని.. ఆ నష్టాన్ని పూడ్చేందుకే ఉద్యోగులు, మంత్రులు అవిశ్రాంతంగా పని చేయాల్సి వస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) పూర్తిగా సహకరిస్తోందని.. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.






