అది ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం: జగన్‌ రాజకీయంపై మంత్రి నిమ్మల ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంలా తయారయ్యాయని ఆయన మండిపడ్డారు...

అది ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం: జగన్‌ రాజకీయంపై మంత్రి నిమ్మల ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంలా తయారయ్యాయని ఆయన మండిపడ్డారు. "చంపుతాం, నరుకుతాం, అంతు చూస్తాం" అనే రీతిలో బెదిరింపులకు దిగడమే వైసీపీ(Ycp) శైలి అని, విధ్వంసం తప్ప ఆ పార్టీకి మరో ఎజెండా లేదని ధ్వజమెత్తారు. వైసీపీ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలా కాకుండా 'గొడ్డలి పార్టీ'గా మారిందని మంత్రి నిమ్మల విమర్శించారు.

ఎవరు అడ్డొచ్చినా...

రాజకీయంగా తనకు ఎవరు అడ్డొచ్చినా వారిని అడ్డుతొలగించుకోవడమే జగన్ నైజమని నిమ్మల ఆరోపించారు. ఆఖరికి సొంత బాబాయ్ అయినా, బయటి వారైనా సరే.. తన అధికారం కోసం ఎవరినైనా అంతం చేయడానికి జగన్ వెనుకాడరని ఆయన విమర్శించారు. వినాశనం పునాదుల మీద రాజకీయం చేస్తున్న వైసీపీ నాయకత్వం వల్ల రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని మంత్రి నిమ్మల హెచ్చరించారు.

Next Story