- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:గుజరాత్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. కారణం ఏంటంటే?
గుజరాత్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతి నిర్మాణంలో భాగంగా మంత్రి నారాయణ, ఆయన బృందం అధ్యయనానికి వెళుతున్న విషయం తెలిసిందే. ఇవాళ(శనివారం) ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి నారాయణ, అధికారులకు గుజరాత్ రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్ నుంచి ఏక్తా నగర్ కు బస్సులో ప్రయాణించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని పరిశీలించారు. మంత్రి నారాయణ,అధికారులు పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను వివరించారు.
నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ అధికారులు పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలు కూడా పరిశీలించారు. అమరావతి(Amarawati)లో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహం నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ తరుణంలో రేపు(సోమవారం) రాత్రి అహ్మదాబాద్‌లోని స్పోర్ట్స్ సిటీని పరిశీలించనున్నారు. మంత్రి నారాయణ బృందం ఎల్లుండి ఏప్రిల్ 21న సబర్మతి రివర్ ఫ్రంట్‌ను పరిశీలించనుంది.






