- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం దేశంలో రాజధాని లేని రాష్ట్రమంటే ఏపీ మాత్రమే అని మంత్రి పొంగూరి నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ మంగళవారం పర్యటించారు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లకు టెండర్లు పిలిచాం అన్నారు. అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇవేవీ పట్టించుకోలేదన్నారు. ఐఐటీ మద్రాస్‌ను పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించాం అన్నారు. 15 రోజుల్లో కాంట్రాక్టర్ల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలపై ఒక పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.
Next Story






