- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి నారాయణ క్లారిటీ
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రహదారుల డెవలప్మెంట్ ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు (Nellore) ఔటర్ రింగ్ రోడ్డు (ORR) విషయమై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) క్లారిటీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలను చేశారు. నెల్లూరుకు ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు అవసరం లేదని అన్నారు. ఓఆర్ఆర్ నిర్మించడమనేది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) చైర్మన్ ఆలోచనగా పేర్కొన్నారు. చైర్మన్ ఆలోచన సరైనదేనని అన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఓఆర్ఆర్ అవసరం లేదనే చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రకటించారు. గతంలో వాహనాలు ట్రంక్ రోడ్డు పై నుంచి హైవేకు వెళ్లేవన్నారు. తద్వారా రోడ్డు రెండు భాగాలుగా విభజించబడేదన్నారు. ఆ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవని తెలియజేవారు.
కానీ మినీ బైపాస్ ఏర్పాటు చేసిన తరువాత సమస్యకు కొంత మేర పరిష్కారం లభించిందన్నారు. దాని వల్ల ట్రంక్ రోడ్డులో ట్రాఫిక్ తగ్గిందని చెప్పారు. నాలుగు లైన్ల బైపాస్ ను ఆరు లైన్లుగా చేస్తున్నారని తెలియజేశారు. రూరల్, సిటీలో హైవేపై రెండు అండర్ పాస్ లు రానున్నాయని వెల్లడించారు. ఓఆర్ఆర్ నిర్మాణానికి రూ.2వేల కోట్లకు పైగా నిధులు అవసరం పడతాయన్నారు. రోడ్డు డిజైన్, భూ సమీకరణ ఖర్చుతో కూడుకున్న పనులన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటిని కొంత కాలం వాయిదా వేసుకోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ ఎజెండాలో కూడా అవుటర్ రింగ్ రోడ్డు ప్రస్తావన లేదని కుండ బద్ధలుగొట్టారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగిన చర్యలను తప్పకుండా తీసుకుంటామని ప్రకటించారు.
Read More..






