- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతికి ఎలాంటి ముప్పు లేదు.. అర్ధరాత్రి పర్యటించిన మంత్రి
మంత్రి నారాయణ మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు రాజధాని అమరావతిలో పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారాయణ మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు రాజధాని అమరావతిలో పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లయిన్లతో నిరంతరాయంగా కొనసాగుతున్న పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని చెప్పారు. కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు సంభవించడంలేదని స్పష్టం చేశారు. మూడేళ్లలో ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏపీలో నిర్మిస్తున్న రాజధాని అమరావతి మునిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు.






