- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబు బాటలో మంత్రి నారాయణ.. షెడ్యూల్ ఖరారు
సీఎం చంద్రబాబు నాయుడు బాటలో మంత్రి నారాయణ నడుస్తున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) బాటలో మంత్రి నారాయణ(Minister Narayana) నడుస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు తాజాగా మరో విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. గతంలో పలు దేశాల్లో పర్యటించిన మంత్రి నారాయణ రాష్ట్రానికి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు 2వ తేదీ నుంచి లండన్(London) పర్యటన కొనసాగనుంది. దీంతో మంత్రి నారాయణ దుబాయ్(Dubai) పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. అయితే సీఎం లండన్ వెళ్లిన ఒక్క రోజు తర్వాత మంత్రి నారాయణ టూర్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. నవంబర్ 6 వరకు ఆయన దుబాయ్‌లోనే ఉండనున్నారు. పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులుకున్న వాతావరణాన్ని వివరించారు. విశాఖలో నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు రావాలని ఆహ్వానించనున్నారు. ఈ సదస్సు నుంచి పెట్టుబడులు ప్రకటించాలని కోరనున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది.






