రెండు, మూడు రోజుల్లో ఫైనల్ చేస్తాం: మహానాడు‌పై మంత్రి నారాయణ క్లారిటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-02 07:55:13  IST  )

ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడును నెల్లూరులో నిర్వహిస్తున్న విషయ తెలిసిందే. అయితే ఈ సభ నిర్వహణ బాధ్యతలను జిల్లా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు అప్పగించారు...

రెండు, మూడు రోజుల్లో ఫైనల్ చేస్తాం: మహానాడు‌పై మంత్రి నారాయణ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మహానాడు(Mahanadu)ను నెల్లూరు(Nellore)లో నిర్వహిస్తున్న విషయ తెలిసిందే. అయితే ఈ సభ నిర్వహణ బాధ్యతలను జిల్లా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అప్పగించారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో మహానాడు నాడు నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా నగరంలో స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రెండు మూడు చోట్ల భూములను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ పండగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ప్లేస్‌ను ఫైనల్ అవుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో మహానాడు నిర్వహణ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Next Story