- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్.. వినతుల వెల్లువ
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. తండ్రి చూపిన బాటలోనే తనయుడు నారా లోకేష్ (Nara Lokesh) ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ప్రజా దర్బార్ ప్రారంభమైంది. నారా లోకేశ్ స్వయంగా ప్రజలతో వారి సమస్యల గురించి చర్చిస్తున్నారు.
ప్రజా దర్బార్ (Praja Darbar) సమాచారం తెలుసుకున్న ప్రజలు మంగళగిరిలోని (Mangalagiri) టీడీపీ ప్రధాన కార్యాలయానికి వరుస కట్టారు. దీంతో రోడ్డు పై వరకు క్యూలైన్ ఏర్పడింది. వందలాదిగా వస్తున్న ప్రజలు తమ బాధలు తీరుతాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులను తీసుకురావడంలోనే కాదు, పేదలను ఆదుకోవడంలోనూ నారా లోకేశ్ ముందుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఆయనే ప్రజాదర్బార్ నిర్వహిస్తుండడంతో ప్రజలు తమ బాధలను చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో మంత్రి నారా లోకేష్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి.






