టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదు: మంత్రి నారా లోకేశ్ మాస్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

మహానాడు ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడులో పాల్గొన్న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు...

టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదు: మంత్రి నారా లోకేశ్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మహానాడు ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడులో పాల్గొన్న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్యపై మండిపడ్డారు. బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా? అని, అందుకే వాళ్లది గొడ్డలి పార్టీ అని లోకేశ్ విమర్శించారు. టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర సైకోదని, తనది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లు పాసైనా, అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ మేరకు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఇది తమ సంకల్పమని, తమ బాధ్యత, తమ కమిట్ మెంట్ అని వ్యాఖ్యానించారు. టైమ్, డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.

Next Story