- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవసరం అయితే ఆర్మీని దించుతాం.. మంత్రి నారా లోకేష్ ప్రకటన
మొంథా తుపాను(Montha Cyclone) ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) స్పష్టం చేశారు.

దిశ, వెబ్డెస్క్: మొంథా తుపాను(Montha Cyclone) ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) స్పష్టం చేశారు. మొంథా తుపాన్పై మంగళవారం హోంమంత్రి అనితతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రులు, అధికారులు అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కూడా నిత్యం పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు. వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు లోకేష్ సూచించారు. అవసరం అయితే ఆర్మీని రంగంలోకి దించుదామని చెప్పారు. గతంలో వచ్చిన తుపాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం మొంథా తుపాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా వస్తోందని.. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా చేరుకుని తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ తుపాన్ దాదాపు 40 లక్షల మందిపై ప్రభావం చూపుతోందని అన్నారు.
Read More... కాకినాడ పోర్టుకు 10వ ప్రమాద హెచ్చరిక.. అసలేంటీ ఈ హెచ్చరికలు? ఎన్నిరకాలు?






