మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్

by Thanuru Gopichand |

తన భార్య నారా బ్రాహ్మణి జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : తన భార్య నారా బ్రాహ్మణి జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన సతీమణి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు. తనకు వెన్నుదన్నుగా ఉంటూ వెన్నంటి నడిచే జీవిత భాగస్వామిని కొనియాడుతూ తన ఖాతాలో పోస్ట్ చేశారు. దైవ దర్శనం అనంతరం నది తీరంలో దిగిన ఫోటోను పోస్టుకు అనుబంధంగా అప్ లోడ్ చేశారు. హ్యాపీ బర్డ్ డే బ్రాహ్మణి.. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ప్రశాంతతలోనూ, గందరగోళంలోనూ నువ్వు నాకు ఎప్పుడూ అండగా ఉన్నావు. దేవాన్ష్ కు ప్రియమైన తల్లివి నువ్వు, ఒక రాక్ స్టార్ సీఈఓవి కూడా, ప్రతి అడుగులో నా తోడుగా నడుస్తున్నావు. నీకు ఎప్పటికీ నేను కృతజ్ఞుడిని. అని తన పోస్టులో పేర్కొన్నారు.

ఎంతో లోతైన భావంతో నారా లోకేశ్ పోస్ట్ చేయడంతో అందరూ మంత్రిలోని మరో కోణాన్ని చూస్తున్నాం అంటున్నారు. భార్యపైన ఇంతటి ప్రేమ ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తండ్రి సీఎం చంద్రబాబు నాయుడుతో అడుగుజాడల్లో నారా లోకేశ్ నడుస్తున్నారని.. ఆయనకు వెన్నంటి ఉండి కొండంత బలాన్నిస్తున్న నారా బ్రాహ్మణి అమ్మ నిండు నూరేళ్లు చల్లంగా ఉండాలని టీడీపీ శ్రేణులు, అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జీవితంలో వారు మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

Next Story