ప్రధాని మోడీకి లోకేశ్ విషెస్.. అస్సాం, బెంగాల్‌ రిజల్ట్స్‌పై ట్వీట్

by Vemula.Srinu Prasad |

అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సాధించిన ఎన్డీయే కూటమికి మంత్రి నారా లోకేశ్ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు....

ప్రధాని మోడీకి లోకేశ్ విషెస్.. అస్సాం, బెంగాల్‌ రిజల్ట్స్‌పై ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం, పశ్చిమ బెంగాల్(Assam, West Bengal) ఎన్నికల ఫలితాల్లో అఖండ విజయం సాధించిన ఎన్డీయే (NDA) కూటమికి మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ప్రజా తీర్పు అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలకు ఉన్న ప్రగాఢమైన, పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన కొనియడారు. ప్రధాని మోడీ(Pm Modi) దార్శనిక నాయకత్వంలో వేగం, నాణ్యత, చిత్తశుద్ధితో సాగుతున్న పాలనపై దేశం ఉంచిన నమ్మకాన్ని ఈ ఫలితం మరోసారి ధృవీకరించిందని తెలిపారు. వృద్ధి, అవకాశాలు, అందరినీ కలుపుకొని పోయే ప్రగతి దిశగా అడుగులు వేస్తున్న నవ భారత ఆకాంక్షలకు ఈ తీర్పు ఒక బలమైన మద్దతుగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

లోకేశ్ ట్వీట్..

Next Story