ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేశ్.. రేపు కేంద్రమంత్రులతో భేటీ

by Vemula.Srinu Prasad |

ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ పలువురు మంత్రులను కలవనున్నారు...

ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేశ్.. రేపు కేంద్రమంత్రులతో భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్(AP Minister Nara Lokesh) ఢిల్లీ(Delhi) చేరుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల(Parliament Winter Session) సందర్భంగా మంగళవారం పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. కేంద్రమంత్రులు అమిత్‌ షాతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను హోంమంత్రి అనితతో పాటు ఆయన సైతం భేటీ భేటీ కానున్నారు. మొంథా తుఫాన్‌తో జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను లోకేష్, అనిత. అందించనున్నారు. పరిశీలన చేసి నిధులు విడుదల చేయాలని కోరనున్నారు.

అంతకుముందు మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితను ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, అప్పల నాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, లావు కృష్ణదేవరాయలు, పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుమల్ల ప్రసాద్‌రావు, టిడిపి సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్ స్వాగతం పలికారు. మంగళవారం కేంద్రమంత్రులను కలిసేందుకు ఏర్పాట్లు చేశారు.

Next Story