ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై రచ్చ.. బొత్సపై మంత్రి లోకేష్ విమర్శలు

by Naga Rani Yarlagadda |

నాల్గవరోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమ్వగా.. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై రచ్చ.. బొత్సపై మంత్రి లోకేష్ విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: నాల్గవరోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమ్వగా.. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యుడైన బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై చర్చించేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ లో రూ.4 వేలకోట్ల బకాయిలు ఉంచిందన్నారు. దీనిపై చర్చించాలని ఇప్పుడు అడుగుతున్న బొత్స.. బీఏసీ మీటింగ్ లో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తనను డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన మండలి చైర్మన్.. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక చర్చ ఉండదని స్పష్టం చేశారు. కాగా.. తాము బకాయిలు పెట్టామన్నదానిలో వాస్తవం లేదన్న బొత్స.. సభలో మంత్రి లోకేష్ మాటలు సరిగ్గా లేవని విమర్శించారు.

Next Story