Minister Lokesh : బారా షాహీద్ దర్గాను సందర్శించిన మంత్రి నారా లోకేష్

by Muthe.Rajitha |

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Minister Lokesh) నేడు నెల్లూరు(Nellore) జిల్లాలోని బారా షాహీద్ దర్గా(Bara Shaheed Dargah)ను సందర్శించారు.

Minister Lokesh : బారా షాహీద్ దర్గాను సందర్శించిన మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Minister Lokesh) నేడు నెల్లూరు(Nellore) జిల్లాలోని బారా షాహీద్ దర్గా(Bara Shaheed Dargah)ను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అలాగే రొట్టెల పండుగ(Rottela Panduga) కార్యక్రమంలో భాగంగా స్వర్ణాల చెరువులో 'ఆరోగ్య రొట్టె' పట్టుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య రొట్టెను పట్టుకున్నానని తెలిపారు. 2014 నుండి తనను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్న నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ ఆహ్వానాన్ని స్వీకరించి తాను వచ్చానని లోకేష్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దర్గా అభివృద్ధి పనులు జరిగాయని, కుల-మత భేదాలకు అతీతంగా జరిగే ఈ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ పండుగ హిందూ-ముస్లిం సామరస్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందిన బారా షాహీద్ దర్గాలో జులై 6 నుండి 10 వరకు జరిగే ఐదు రోజుల ఉత్సవం. ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు స్వర్ణాల చెరువులో తమ కోరికలకు సంబంధించిన రొట్టెలను మార్చుకోవడానికి వస్తారు.

Next Story