- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబరు 6 నుంచి అమెరికాలో నారా లోకేశ్ పర్యటన
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. డిసెంబర్ 6వ తేదీన ఆయన అమెరికాకు పయనమవ్వనున్నారు. 9వ తేదీ వరకూ అమెరికాలో పర్యటించనున్న ఆయన.. తొలిరోజు డల్లాస్ లో తెలుగు కమ్యూనిట విత్ నారా లోకేశ్ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ వంటి సిటీల్లోనూ పర్యటించి పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు.
ఈ పర్యటనలో భాగంగా డల్లాస్ కు సమీపంలోని గార్లాండ్ లో ఉన్న కర్టిస్ కల్వెల్ సెంటర్లో ఒక భారీ సభను నిర్వహించనున్నారు. సుమారు 8 వేల మంది ప్రవాస ఆంధ్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కెనడా నుంచి కూడా పలువురు వస్తారని సమాచారం. ఈ సభలో లోకేశ్.. ప్రవాసాంధ్రులను రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరనున్నారు. అలాగే టెక్, ఐట రంగాల్లో అవకాశాలు, యువ నాయకత్వం వంటి అంశాలపై చర్చించనున్నారు.






