- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు: మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
త్వరలోనే పెద్దఎత్తున ఏపీకి పెట్టుబడులు రానున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: త్వరలోనే పెద్దఎత్తున ఏపీ(Ap)కి పెట్టుబడులు రానున్నాయని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తెలిపారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) టీమ్ రూ. 45 వేల కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరిందని లోకేశ్ తెలిపారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారని, పెట్టుబడులు పెట్టాలని జూమ్ కాల్ ద్వారా ఆర్సెల్లార్ మిత్తల్‌ను ఆహ్వానించామని చెప్పారు. శంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్‌లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధిలో విశాఖ లేదని.. దానిని ఐటీ పటంలో పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99 పైసలకే భూమి కేటాయించామని చెప్పారు. వైసీపీ తెచ్చిన పెట్టుబడులకంటే కూటమి ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ అని మంత్రి లోకేశ్ తెలిపారు.
‘‘పారదర్శకతలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు. సింగపూర్ పర్యటనలో రూ.,45 వేల కోట్లతో పెట్టుబడులకు ఒప్పందాలు - ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌తో ఒప్పందాలు చేసుకున్నాం. కానీ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని ఈ-మెయిల్ పంపారు. ఈ-మెయిల్ పెట్టిన మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. పెట్టుబడులు రాకుండా వైసీపీకి సంబంధమున్న మురళీకృష్ణ ఈ-మెయిల్ పెట్టారు. టీసీఎస్‌కు 99 పైసలకే భూమి కేటాయిస్తే వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు.’’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






