- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాన్న పొద్దున్నే నిద్రలేపితే తిట్టుకున్నా: నారా లోకేశ్
పొద్దున్నే నాన్న నిద్రలేపితే తిట్టుకున్నానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visaka)లో ‘యోగా డే’(Yoga Day)కు సర్వంసిద్ధమైంది. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోడీ(Pm Modi), సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సహా కూటమి ప్రభుత్వ నాయకులంతా విశాఖకు చేరుకున్నారు. విశాఖ డక్ యార్డు(Visakha DuckYard)లో మోడీ బసకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన అక్కడకు చేరుకున్నారు.
అయితే అంతకుముందు విశాఖలో 25 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేశారు. ఈకార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని గుర్తు చేశారు. చిన్నప్పుడు తాను నిద్రపోతుండగా పొద్దునే తన తండ్రి చంద్రబాబు నాయుడు నిద్ర లేపారని, ఆ సమయంలో తాను తిట్టుకున్నానని తెలిపారు. పొద్దున్నే నిద్రలేపడమేంటోనని అసహనం వ్యక్తం చేసుకునే వాడినని చెప్పారు. అలా తనతో చంద్రబాబు యోగా నేర్పించారని చెప్పారు. కానీ ఆనాడు తనకు నేర్పిన క్రమశిక్షణ, పట్టుదలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని లోకేశ్ తెలిపారు. అదే క్రమ శిక్షణ, పట్టుదల విద్యార్థులందరిలో ఉందని, ఆ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఏ ఆశయంతోనైతే ముందుకు వెళ్లాలనుకుండే దాని కోసమే పని చేయాలని సూచించారు. లక్ష్యంతో పని చేస్తే విజయాలు సొంతమవుతాయని నారా లోకేశ్ పేర్కొన్నారు.






