ఫైల్స్ పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో చంద్రబాబు.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కోసం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు..

ఫైల్స్ పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో చంద్రబాబు.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కోసం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) చాలా కృషి చేశారని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. స్విట్జర్‌లాండ్ జ్యురిక్‌(Switzerland, Zurich)లో పారిశ్రామిక వేత్తల(Industrialists)తో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఐటీని తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఫైల్స్ పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో తిరిగారని గుర్తు చేశారు. ఆలోచనలు చేయడంతో చంద్రబాబుతో పోటీ పడలేకపోతున్నామన్నారు. జైలులో పెట్టిన్నప్పుడు కూడా మాకు ధైర్యం చెప్పారు తప్ప ఆయన భయపడలేదని లోకేశ్ చెప్పారు. యూరప్‌లో చాలా మంది తెలుగు వాళ్లు బిజినెస్ చేస్తున్నారని, అన్ని రంగాల్లో రాణించాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Next Story