- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏయూలో విద్యార్థి మృతి.. రాజకీయం చేయొద్దన్న మంత్రి నారా లోకేష్
ఏయూ హాస్టల్ (AU Hostel)లో ఉంటున్న స్టూడెంట్ మణికంఠ సకాలంలో వైద్యం అందక మరణించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఏయూ హాస్టల్ (AU Hostel)లో ఉంటున్న స్టూడెంట్ మణికంఠ సకాలంలో వైద్యం అందక మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీ (AP Assembly)లో కీలక ప్రకటన చేశారు. మణికంఠకు ఫిట్స్ రావడంతో.. తోటి విద్యార్థులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కానీ అప్పటికే మణికంఠ చనిపోయారని, నిజానికి అంబులెన్సులోనే ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా, డ్రైవర్ లేదని చెప్పడంతో విద్యార్థులు కూడా చెక్ చేయలేదన్నారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాసులు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్న మంత్రి.. ఏయూను టాప్-100లో ఉంచాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏయూ విద్యార్థులతో ఎలాంటి చర్చలకైనా ప్రభుత్వం రెడీగా ఉందని, కాదనీ రాజకీయం చేస్తామంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థుల్ని హెచ్చరించారు.
మరోవైపు 2019-24 మధ్యకాలంలో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ సభలో తెలిపారు. కంప్యూటర్ల కొనుగోళ్లలో అవకతవకలు, వర్సిటీ వాహనాలను వ్యక్తిగత పనులకు వాడటం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్మెంట్ లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంపై కమిటీ వేస్తామన్నారు. 100 రోజుల్లో నివేదికను తెప్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఏయూలో విద్యార్థుల ఆందోళన రెండోరోజుకు చేరుకుంది. వర్సిటీలో తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తుండగా.. వీసీ రావడంతో విద్యార్థులు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు విద్యార్థులతో వీసీ రాజశేఖర్ చర్చలు జరుపగా రెండ్రోజుల్లో సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల్ని వెనక్కి పంపి.. మణికంఠ ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.






