- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్.. అక్షరాల అందం నేర్పిన ఉపాధ్యాయుడిపై మంత్రి లోకేశ్ ప్రశంసలు
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు మెయిన్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న షేక్ ఫిరోజ్ భాషాపై టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు మెయిన్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న షేక్ ఫిరోజ్ భాషా(Sheikh Feroz Basha)పై టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ప్రశంసలు కురిపించారు. పిల్లల తలరాతను మార్చే విద్యను అందిస్తూ, అందమైన అక్షరాలు పొందికగా రాయడం నేర్పిస్తున్న షేక్ ఫిరోజ్ భాషా ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారని శనివారం మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రతి రోజూ ఉదయం ముందుగానే పాఠశాలకు వెళ్లి, సాయంత్రం అదనపు సమయం స్కూలులో గడుపుతూ విద్యార్థులకు క్లాసులు తీసుకునే భాషా కమిట్మెంట్‌కి హ్యాట్సాఫ్ అంటూ ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ హ్యాండ్‌రైటింగ్‌ను డిజిటల్ ప్రింటింగ్‌లా అందంగా నేర్పడం అభినందనీయమని అన్నారు.
పిల్లల్లో పాఠాలపై ఉన్న భయాలను పోగొట్టి, ఆటపాటలతో బోధన చేస్తున్న భాషా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుతుండటం గర్వకారణమని, ఇలాంటి మార్పులే ప్రభుత్వ పాఠశాలల్లో తాను ఆశిస్తున్నానని వెల్లడించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు తన శక్తిమేర కృషి చేస్తున్న షేక్ ఫిరోజ్ భాషాకి, ఆయనకు తోడ్పడుతున్న టీచర్లు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ కోసం క్లిక్ చేయండి..






