ఏపీకి భారీగా పెరుగుతున్న పెట్టుబడులు.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలను ఆకర్శిస్తున్న మంత్రి నారా లోకేష్

by Malleboina Mahesh |

రాష్ట్రంలో పెట్టుబడులో లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధి దిశలో చారిత్రాత్మకంగా నిలుస్తోంది.

ఏపీకి భారీగా పెరుగుతున్న పెట్టుబడులు.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలను ఆకర్శిస్తున్న మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడులో లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధి దిశలో చారిత్రాత్మకంగా నిలుస్తోంది. పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ విధానాలకు ఆకర్శితమై ఒక్కో కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతుంది. అయితే ఈ విజయాల వెనుక ఉన్న ప్రధాన శక్తిగా ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి నారా లోకేష్ పేరే ముందుకు వినిపిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని పూర్తిగా మారుస్తూ, ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించడానికి లోకేష్ చేపట్టిన కృషి పరిశ్రమలకు కొత్త ఆశా కిరణంగా మారింది.

రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం, పరిశ్రమల సమస్యలను తక్షణమే పరిష్కరించడం, రాష్ట్ర పరిశ్రమ విధానాలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం వంటి చర్యలతో మంత్రి లోకేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సమ్మిట్‌కు హాజరైన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఏకగ్రీవంగా లోకేష్ నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించడం హైలెట్‌గా నిలిచింది. దీంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలతో ఒప్పందాలు తుది దశకు చేరేందుకు లోకేష్ స్వయంగా సమన్వయం చేసినట్లు స్పష్టమవుతోంది.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా మంత్రి లోకేష్ నాయకత్వాన్ని మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాల వల్లే పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని గోయల్ అభినందించారు. పెట్టుబడిదారుల అవసరాలను అర్థం చేసుకుని, ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారం అందించడంలో లోకేష్ పాత్ర అత్యంత ముఖ్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నాడం విశేషం.

రాష్ట్రంలో పెట్టుబడులకు భారీగా ముందుకొచ్చిన అదానీ గ్రూప్ కూడా తమ విజయానికి లోకేష్‌నే ప్రధాన కారణంగా పేర్కొంది. ఇప్పటికే ₹40,000 కోట్ల పెట్టుబడులు చేసిన అదానీ గ్రూప్, మరిన్ని పెట్టుబడులకు కూడా సిద్ధమని ప్రకటించింది. తమ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ముందస్తు సహకారం, ముఖ్యంగా లోకేష్ బృందం అందించిన వేగవంతమైన స్పందన తమను మరింత ఉత్సాహపరిచిందని కంపెనీ వెల్లడించింది.

మరోవైపు, SYRMA SGS మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ ఎస్. గుజ్రాల్ కూడా లోకేష్ పనితీరును ఘనంగా ప్రశంసించారు. తమ కంపెనీకి అవసరమైన అనుమతులు ప్రభుత్వం కేవలం 14 రోజుల్లో అందించిందని పేర్కొంటూ, “దేశంలో ఇంత వేగంగా అనుమతులు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదని, ఇది పూర్తిగా లోకేష్ ముందడుగు వల్లే సాధ్యమైందని అన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమ్మిట్ మొత్తం ఫలితాలను విశ్లేషిస్తూ, లోకేష్ తీసుకొస్తున్న పెట్టుబడి వాతావరణం భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని అభినందించారు. దీంతో విశాఖ వేదికగా జరుగుతున్న ఈ సీఐఐ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను పారించడంతో పాటు మంత్రి లోకేష్ ముందు చూపు, ఐటీ శాఖపై ఆయనకు ఉన్న పట్టును నిరూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

Next Story