- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హయ్యర్ ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
సీఐఐ దక్షిణ మండలి, వీఐటీ సంయుక్తంగా నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో ఏపీ మంత్రి నారాలోకేష్ పాల్గోన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సీఐఐ దక్షిణ మండలి, వీఐటీ సంయుక్తంగా నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను మరింత ఉన్నత స్థాయిలో ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ అన్నారు. “ముందుగా సీఐఐ, వీఐటీకి ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే భారత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉన్నత విద్యను పునర్నిర్మించుకోవాలని చెబుతున్నారు. కానీ మనం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోవాలని లోకేష్ అన్నారు.“ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దృష్టి, మనం ఇక్కడి నుంచి చేసే సంస్కరణలు, సహకారం, మార్పులపై ఆధారపడి ఉంటుందని, మానవ, మేధో మూలధనాన్ని సద్వినియోగం చేయకుండా ఆర్థిక వృద్ధి సాధ్యం కాదని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు.






