- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: వడ్డే ఓబన్నకు ఘన నివాళి
వడ్డే ఓబన్నకు మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు..

దిశ, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న(Wadde obanna) జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి అర్పించారు. వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వడ్డే ఓబన్నను లోకేశ్ స్మరించుకున్నారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఆయన చరిత్ర చిరస్మరణీయమన్నారు. వడ్డే ఓబన్న విలువలు, సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజం నిర్మాణం కోసం కృషిచేద్దామని మంత్రి లోకేశ్ పిలుపు నిచ్చారు.
స్వాతంత్య్ర సమరయోధులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేనాధిపతి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు,… pic.twitter.com/0sKz5kUt05
— Lokesh Nara (@naralokesh) January 11, 2025






