మంగళగిరిలో టాటా హిటాచి షోరూం ఓపెనింగ్..మంత్రి లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

మంగళగిరి-ఆత్మకూరు పరిధిలోని టాటా హిటాచి షోరూం గ్రాండ్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్..

మంగళగిరిలో టాటా హిటాచి షోరూం ఓపెనింగ్..మంత్రి లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : మంగళగిరి-ఆత్మకూరు పరిధిలోని టాటా హిటాచి షోరూం గ్రాండ్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రిబ్బ‌న్ క‌ట్ చేసి, షోరూం ఓపెన్ చేశారు. అనంత‌రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు నారా లోకేష్. వైసీపీ స‌ర్కార్ బుల్డోజ‌ర్ల‌తో విధ్వంసం సృష్టించ‌ని ఆగ్ర‌హించారు. కానీ మేం అభివృద్ధి చేసి, చూపిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. త‌మ‌ది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వ‌మ‌న్నారు. ఓడిన చోట గెలవాలన్న ముఖ్య లక్ష్యంతో తాను పనిచేశానని, అందుకే మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేదని గుర్తు చేశారు నారా లోకేష్.

మంగళగిరి నియోజకవర్గాన్ని తాను అస్సలు వదలబోనని ప్రకటించారు. తనను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో జేమ్స్ అండ్ జువెలరీ పార్క్ అభివృద్ధి పైన కూడా ఫోకస్ చేసినట్లు తెలిపారు. టాటా హిటాచి తో పాటు ఇతర అనుబంధ సంస్థలను లక్ష్మీ గ్రూప్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.

Next Story