- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో నారా లోకేష్ భేటీ.. రాష్ట్రానికి కీలక హామీ
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ జేపీ నడ్డాకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ జరుగుతుండటంతో వ్యవసాయ పనుల్లో యూరియా కొరత ఉందని, వెంటనే దానికి తీర్చాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జేపీ నడ్డా.. ఆగస్టు 21 నాటికి ఆంధ్రప్రదేశ్ కు 29 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉపాధి కోసం ప్లాస్టిక్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరగా.. దానిని ఆమోదించారు.
14 నెలల్లో కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టిన, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కేంద్ర సహకారం కావాలని కోరారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేష్.. మంత్రికి తెలిపారు. లోకేష్ వెంట మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఉన్నారు.






