సతీసమేతంగా షిరిడీ సాయి సన్నిధిలో మంత్రి నారా లోకేశ్

by Thanuru Gopichand |

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత.

సతీసమేతంగా షిరిడీ సాయి సన్నిధిలో మంత్రి నారా లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : షిరిడీ సాయిబాబాను (Shiridi Saibaba) రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సతీసమేతంగా దర్శించుకున్నారు. సాయినాథుడిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి ఆయన సతీసమేతంగా షిరిడీ చేరుకున్నారు. మంత్రి లోకేశ్ దంపతులకు కోపర్గావ్ ఎమ్మెల్యే, శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఆలయ అదికారులు సాదరంగా స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసిన మంత్రి నారా లోకేశ్ బ్రాహ్మణి దంపతులు తెల్లవారుజామున సాయినాథుడిని దర్శించుకున్నారు. సన్నిధిలో జరిగిన కాకడ హారతిలో భాగస్వాములయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అర్చకుల ఆశీర్వచనాలను అందుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని మంత్రి లోకేశ్ బ్రాహ్మణి దంపతులు సాయినాథుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. పూజాధికాల అనంతరం ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు వారిని దుశ్వాలువాతో సత్కరించారు. సాయినాథుడి తీర్థప్రసాదాలను అందజేశారు. సాయిబాబా సన్నిధిలో ఆధ్యాత్మికంగా సమయం వెచ్చించడం పట్ల దంపతులిరువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Next Story