- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో వరుస నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) గుడ్ న్యూస్ తెలిపారు. వరుస నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేశ్.. ప్రతిఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీపై చర్చించారు. ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెట్, డీఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయనున్నామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
‘‘2026 జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తాం. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించాం. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరా.’’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.






