Nara lokesh: ఐసీసీ చైర్మన్ జైషాతో భేటీపై క్లారిటీ ఇచ్చిన లోకేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-27 16:33:14  IST  )

ఐసీసీ చైర్మన్ జైషాతో భేటీపై మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు...

Nara lokesh: ఐసీసీ చైర్మన్ జైషాతో భేటీపై క్లారిటీ ఇచ్చిన లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్‌(Dubai)లో జరిగిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌(India-Pakistan Match)ను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) చూసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఐసీసీ చైర్మన్ జైషా(ICC Chairman Jaisha)ను ఆయన కలిశారు. అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియాన్ని అమరావతిలో నిర్మించాలని జైషాను కోరారు. అయితే అందుకు ఆయన వెంటనే అంగీకరించినట్లు లోకేశ్ తాజాగా తెలిపారు. అహ్మదాబాద్ స్టేడియం నిర్మాణం, ఇతర అవసరాలకు దానిని ఎలా వాడుతున్నారు అనే అంశాలను జైషాకు వివరించినట్లు పేర్కొన్నారు. దుబాయ్ స్టేడియం చిన్నదైనా దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు?, సీటింగ్ ఎలా ఉంది?, క్వాలిటీ ఎలా ఉంది అనేది మొత్తం గమనించినట్లు లోకేశ్ స్పష్టం చేశారు.

అయితే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనివార్యంగా వస్తుందని లోకేశ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుండి యువతను క్రికెట్ మరో నాలుగైదు ఆటల్లో ప్రోత్సహించి క్రీడారంగాన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా శాప్ చైర్మన్, ఏసీసీ అధ్యక్షులను కలిసినట్లు చెప్పారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై చర్చించినట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Next Story