- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Nara Lokesh: తిరుపతి ఘటనపై సీరియస్.. మారరా అంటూ ఫైర్
తిరుపతిలో వైసీపీ నేత అరాచకం సంచలనంగా మారడంతో మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు....

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Titupati)లో వైసీపీ(Ycp) సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ అనిల్ రెడ్డి రెచ్చిపోయారు. శ్రీనివాసం వసతి గృహం(Srinivasam Vasati Gruham) వద్ద ఉన్న షాపు కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ గిరిజన యువకుడు పవన్‌పై దాడి చేశారు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో నిందితుడు అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన తర్వాత బాధితుడు పవన్ కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.
కాగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలానికి చెందిన యువకుడు పవన్‌కు తిరుపతి శ్రీనివాసం వసతి గృహం వద్ద షాపు ఉంది. ఈ షాపు కాంట్రాక్ట్ కావాలని కొన్ని రోజులుగా పవన్‌ను అనిల్ రెడ్డి అడుగుతున్నారు. అయితే ఇవ్వమని పవన్ చెబుతూ వచ్చారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న అనిల్ రెడ్డి.. పవన్‌ను రూమ్‌లో బంధించి కర్రతో చితక్కొట్టారు. వదిలేయమని అడిగినా దాడి చేశారు. అంతేకాదు తాను కొడుతున్న వీడియోను స్నేహితులతో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ప్రజలు ఛీకొట్టినా వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకూ దళితులపై దమనకాండ జరిపారు. ఇప్పుడు కూడా అదే పందా కొనసాగిస్తున్నారు. తిరుపతిలో నాయకులు దళిత యువకుడిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాడులకు రాష్ట్రంలో చోటు లేదు. రప్పా... రప్పా అంటే ఏపీ పోలీస్ రఫ్ఫాడిస్తారు’’అని లోకేశ్ హెచ్చరించారు.






