- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో భూమున అనుచరుల అరాచకం.. నారా లోకేశ్ సంచలన ట్వీట్
రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డి అయిదేళ్ల అరాచక పాలనను భరించలేక ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) అయిదేళ్ల అరాచక పాలనను భరించలేక ప్రజలు కూకటి వేళ్ళతో పెకలించారని మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) విమర్శించారు. తిరుపతి ఘటన(Tirupati Incident)పై ఆయన స్పందించారు. వైసీపీ(Ycp) నేతలపై విమర్శలు కురిపించారు. అధికారం పోయి ఏడాది గడిచినా వైసీపీ పిల్ల సైకోలు పాత వాసనలు వీడకుండా అక్కడక్కడా దుశ్చర్యలకు పాల్పడుతున్నారని సెటైర్లు వేశారు. తిరుపతిలో మోహనరావు అనే కారు స్పేర్ పార్టుల వ్యాపారి నుంచి వాటాల కోసం వైసీపీ నేత భూమన అభినయ్ అనుచరులు చైతన్య, సాయి, యశ్వంత్ విచక్షణారహితంగా దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో రౌడీలు, గూండాలు, సైకోలకు తావులేదని హెచ్చరించారు. అటువంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఘటనపై దర్యాప్తు జరిపి, నిందితులకి శిక్ష పడేలా చూడాలని పోలీసు వారిని కోరుతున్నానని ట్వీట్ చేశారు.






