- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హై స్కూల్ హెచ్ఎంను సత్కరించిన మంత్రి నారా లోకేష్
by Naga Rani Yarlagadda |
కృష్ణాజిల్లాలోని పెనమలూరు హైస్కూల్ హెచ్ఎం దుర్గాభవానిని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శుక్రవారం సత్కరించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లాలోని పెనమలూరు హైస్కూల్ హెచ్ఎం దుర్గాభవానిని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శుక్రవారం సత్కరించారు. షైనింగ్ టీచర్ పేరుతో ఆమెను గౌరవంగా సత్కరించినట్లు మంత్రి తెలిపారు. ఒక స్కూల్ కి ప్రధాన ఉపాధ్యాయురాలిగా అద్భుతమైన పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రి ప్రశ్నంసించారు. దుర్గా భవానికి వృత్తిపట్ల ఉన్న నిబద్ధతతో విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆమెలాంటి హెచ్ఎంలు ఉంటే ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డులు వస్తాయని ఆశించారు. అలాంటి రోజు వచ్చినపుడు ప్రభుత్వ స్కూల్స్ లోనూ మంచి విద్య అందుతోందన్న విషయాన్ని తల్లిదండ్రులు నమ్ముతారన్నారు.
Next Story






