- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ బిజీబిజీ
కీలక అంశాలపై కేంద్రమంత్రులతో సమావేశం కానున్న మంత్రి. పెట్టుబడులు, బడ్జెట్, విద్యానుబంధ అంశాలపై చర్చకు ఆస్కారం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీలో (Delhi) రాజకీయ, అధికారిక వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. నేడు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), కేంద్ర విద్యాశిక్షణ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను (Dharmendra Pradhan) కలిసి కీలక చర్చలు జరపనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, బడ్జెట్ అమలు, విద్యా సంస్కరణలు, పెట్టుబడులు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో దృష్టి సారించనున్నారు. ఫిబ్రవరి 3న (మంగళవారం) ఢిల్లీ చేరుకున్న లోకేశ్ టీడీపీ (TDP) ఎంపీలతో సమావేశమై పార్లమెంట్ సెషన్ ఎజెండా, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నిర్మాణాత్మక, సమస్యాధారిత భాగస్వామ్యంపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటన స్వల్పకాలికమైనదిగా పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2026-27 యూనియన్ బడ్జెట్‌ను లోకేష్ ఇటీవల స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్‌లకు బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది భారత్ వేగవంతమైన వృద్ధి, దీర్ఘకాలిక ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో క్రిటికల్ మినరల్స్ కారిడార్, హై-స్పీడ్ రైల్ కనెక్టివిటీ, డేటా సెంటర్లకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ మద్దతు, టూరిజం ప్రోత్సాహాలు ఏపీకి ఉపయోగపడతాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాల అమలు, రాష్ట్రానికి అదనపు నిధులు, పెట్టుబడులపై నేటి సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశంలో విద్యా రంగ సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్‌లో లోకేష్ ప్రధాన్‌ను కలిసి STARS ప్రాజెక్ట్ కింద రూ.4,400 కోట్ల రూపాయల నిధులను కోరారు. ఏపీలో విద్యా సంస్థల బలోపేతం, సంస్కరణలపై చర్చించారు. నేటి భేటీ ఈ అంశాల ఫాలో-అప్‌గా ఉండవచ్చు. ఏపీలో LG ఎలక్ట్రానిక్స్ రూ.5,000 కోట్ల ప్లాంట్ స్థాపన వంటి అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో, బడ్జెట్ ఇన్సెంటివ్స్ దీన్ని మరింత ప్రోత్సహిస్తాయని భావిస్తున్నారు. ఏపీ విభజన హామీల అమలు, రాష్ట్ర ప్రయోజనాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల వారు చెబుతున్నారు. లోకేష్ ఈ పర్యటన ద్వారా కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన సమావేశాలు ఫలవంతం కావాలని, ఏపీకి మరింత లాభం చేకూరాలని ప్రజలు కోరుకుంటున్నారు.






