అహంకారం వల్లే అలా జరిగింది: మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-29 11:36:03  IST  )

అహంకారం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 11కు పడిపోయిందని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు....

అహంకారం వల్లే అలా జరిగింది: మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అహంకారం వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 11కు పడిపోయిందని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అమరావతి(Amaravati)లో ఆయన మాట్లాడుతూ ఆనాటి పాలన దారుణమని చెప్పారు. పవిత్ర దేవాలయంలా పార్టీ కార్యాలయాన్ని భావిస్తామని గత ప్రభుత్వంలో దాడి చేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. మనం అధికారంలో ఉండాలా లేదా ప్రతిపక్షంలో ఉండాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. కానీ అరాచకాలకు పాల్పడకూదన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లు భావించి పని చేయాలని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామన్నారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలను తాము మర్చిపోమన్నారు. పార్టీలో మహిళలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తామని చెప్పారు. ఇందుకోసం పార్టీ సంస్థాగతంపై దృష్టి పెడతామని తెలిపారు. వచ్చే నెల 5 నాటికి అన్ని కమిటీలను పూర్తి చేస్తామని, సీనియర్ల అనుభవం, యువత శక్తిని పార్టీ కోసం వినియోగించుకుంటామని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా సీనియర్లే పార్టీని ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఏడాది పాలనలో ప్రభుతం చేసిన సేవలను ప్రతి ఇంటికెళ్లి వివరించాలని పార్టీ నేతలకు మంత్రి నారా లోకేశ్ సూచించారు.

Next Story